లక్నో: గత డిసెంబర్లో ముగిసిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని టీమ్ఇండియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు బంపరాఫర్. 2025 సీజన్లో అతడు లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడనున్నాడు. ఆ జట్టు పేసర్ మోహ్సిన్ ఖాన్ గాయంతో సీజన్‌కు దూరమవడంతో లక్నో యాజమన్యం ఆ స్థానాన్ని శార్దూల్ (రూ. 2 కోట్లకు)తో భర్తీ చేసింది.