హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో వచ్చే జూన్‌లో జరుగబోయే టీజీ టీ20 లీగ్‌కు సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. 8 ఫ్రాంచైజీలతో నిర్వహించనున్న ఈ టోర్నీలో లోగోను మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆవిష్కరించాడు.
ఈ సందర్భంగా రాయుడు మాట్లాడుతూ.. ‘మన దగ్గర ఉన్న ఆటగాళ్ల ప్రతిభను సానబెట్టేందుకు ఈ లీగ్ అద్భుతమైన వేదిక అవుతుంది’ అని అన్నాడు. రూరల్ క్రికెటర్లను కనెక్ట్ చేసి వారిని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ లీగ్ ఉపయోగపడుతుందని హెచ్‌సీఏ సెక్రటరీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.