Ten Doeschate | టీమిండియా ఓటమిని నమ్మలేకపోతున్నా : టెన్ డస్కాటే
Ten Doeschate | ఐర్లాండ్‌తో(Ireland) జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో అనూహ్యంగా వైట్‌వాష్‌కు గురవడాన్ని నమ్మలేకపోతున్నట్లు టీమ్ ఇండియా(Team India) సహాయ కోచ్ ర్యాన్ టెన్ డెస్కాటే(Ten Doeschate) అన్నారు.
Ten Doeschate | ఐర్లాండ్‌తో(Ireland) జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో అనూహ్యంగా వైట్‌వాష్‌కు గురవడాన్ని నమ్మలేకపోతున్నట్లు టీమ్ ఇండియా(Team India) సహాయ కోచ్ ర్యాన్ టెన్ డెస్కాటే(Ten Doeschate) అన్నారు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండుసార్లు వరుసగా ప్రపంచ ఛాంపియన్స్‌గా నిలిచిన ఇండియా సామర్ధ్యాన్ని ఒక్క సిరీస్‌తో తక్కువ అంచనా వేయలేమన్నారు. టీమిండియా పిచ్ కండీషన్స్ అర్థం చేసుకోవడంలో విఫలమైందని అంగీకరించారు.
ఐర్లాండ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడి విజయం సాధించిందని, ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ తరహా ఫ్లాట్ పిచ్‌ల నుండి పెద్ద బౌండరీలున్న బెల్ఫాస్ట్లోని‘స్పైసీ’ ట్రాక్‌లకు మారడంలో భారత బ్యాటింగ్ లైనప్ కొంత ఇబ్బంది పడిందని అంగీకరించారు. ఇదే సమయంలో ఇదే సమయంలో ఐర్లాండ్ స్థానిక పరిస్థితులను చక్కగా అర్ధం చేసుకొని ఇండియాను తెలివిగా ఓడించిందని ప్రశంసించారు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
రెండో టీ20 మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో నాటకీయంగా ఓడిపోవడంతో టీ20లలో భారత్ కొనసాగించిన 16 సిరీస్‌ల అజేయ పరంపరకు బ్రేక్ పడింది.
కాగా, అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా పసికూనగానే చలామణి అవుతున్న ఐర్లాండ్ అద్భుతమే చేసింది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్ ఎడిషన్లలో మేటి జట్లను కంగుతినిపించిట్రోఫీలు గెలిచిన భారత జట్టుకు దిమ్మతిరిగే షాకిస్తూ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్ ఎడిషన్లలో మేటి జట్లను కంగుతినిపించిట్రోఫీలు గెలిచిన భారత జట్టుకు దిమ్మతిరిగే షాకిస్తూ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం ఇక్కడ చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరులో ఐరిష్ జట్టు.. ఒక్క పరుగు తేడాతో టీమిండియాను చిత్తుచేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ప్రత్యర్థి నిర్దేశించిన 154 పరుగుల ఛేదనలో మరోసారి బ్యాటింగ్ వైఫల్యంతో చేతులెత్తేసిన భారత్.. 153/9 వద్దే ఆగిపోయి ఓటమిని మూటగట్టుకుంది. తిలక్ వర్మ (46 బంతుల్లో 55, 3 ఫోర్లు, 1 సిక్స్), హర్షిత్ రాణా (10 బంతుల్లో 21, 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలినవారంతా మళ్లీ చేతులెత్తేశారు. గత మ్యాచ్‌లో భారత్‌ను దెబ్బకొట్టిన భారత సంతతి బౌలర్ జై మూండ్రా, మాథ్యూ హాలార్డ్ తలా మూడు వికెట్లతో మరోసారి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. జైకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. హ్యారీ టెక్టర్ (53), బెంజిమిన్ (37) రాణించడంతో 154/8 చేసింది. ప్రిన్స్ యాదవ్ (3/22) మెరిశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

