హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మరోపోరు అభిమానులను కట్టిపడేసింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు టైటాన్స్ 35-34 తేడాతో తమిళ్ తలైవాస్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. పీకేఎల్-8వ సీజన్ తర్వాత తలైవాస్‌పై టైటాన్స్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.
టైటాన్స్ తరఫున స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లతో అదరగొట్టగా, అశిష్ నార్వల్(9), విజయ్ మాలిక్(4) ఆకట్టుకున్నారు. మరోవైపు తలైవాస్ జట్టులో సచిన్ 17 పాయింట్లతో టాప్‌స్కోరర్‌గా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. పీకేఎల్‌లో 1000 పాయింట్ల క్లబ్లో సచిన్ తాజాగా చేరాడు. వరుసగా హ్యాట్రిక్ విజయంతో టైటాన్స్ 21 పాయింట్లతో 4వ స్థానంలోకి దూసుకురాగా, తలైవాస్ 21 పాయింట్లతో మూడులో ఉంది. మరో మ్యాచ్‌లో యూ ముంబా 42-40తో పాట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది.