Telugu Titans | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. శనివారం గచ్చిబౌలి స్టేడియంలో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో టైటాన్స్ 34-33తో పుణెరి పల్టాన్పై అద్భుత విజయం సాధించింది.
టైటాన్స్ తరఫున విజయ్ 13 పాయింట్లతో అదరగొట్టగా, స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్(12) మరోసారి దుమ్మురేపా డు.