జైపూర్: అరంగేట్రం ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్(పీహెచ్ఎల్)లో తెలుగు టాలన్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. గురువారం సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో పీహెచ్ఎల్ తొలి సీజన్‌కు ఘనంగా తెరలేచింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో తెలుగు టాలన్స్ 39-32 తేడాతో గార్విట్ గుజరాత్‌పై అద్భుత విజయం సాధించింది.
స్టార్ ప్లేయర్ దేవేందర్ భుల్లార్, అనిల్ ఖడియా, రఘు మెరుపులు మెరిపించారు. దీంతో ప్రథమార్ధం ముగిసే సరికి టాలన్స్ 19-16తో ఆధిక్యంలో నిలిచింది.అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో రాజస్థాన్ పాట్రియాట్స్ 28-27తో మహారాష్ట్ర ఐరన్మ్యాన్పై గెలిచింది.