హైదరాబాద్, ఆట ప్రతినిధి: మంగళూరు వేదికగా జరుగుతున్న 77వ జాతీయ సీనియర్ అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఈత కొలనులో తనకు తిరుగులేదని మరోమారు చాటిచెబుతూ వ్రితి సత్తాచాటింది. బుధవారం జరిగిన మహిళల 1500మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో వ్రితి పసిడి పతకంతో మెరిసింది. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన వ్రితి 17:45:63 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు శిరిన్ (17:50:61సె, కర్ణాటక), భవ్య సచ్‌దేవా (18:00:28సె, ఢిల్లీ) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
శభాష్ వ్రితి: ఎక్స్‌లో కేటీఆర్
జాతీయ సీనియర్ స్విమ్మింగ్ టోర్నీలో పతకాలు కొల్లగొడుతున్న యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో ప్రత్యేకంగా అభినందించారు. ‘తెలంగాణ బిడ్డ వ్రితికి శుభాకాంక్షలు. స్విమ్మింగ్ పూల్‌లో పతకాలతో పాటు మా హృదయాలను గెలిచావు. తెలంగాణ గర్వపడేలా ఇలాంటి విజయాలు మరిన్ని సాధిస్తూనే ఉండాలి’ అని రాసుకొచ్చారు.