హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ శౌర్య ఐటీఎఫ్ వరల్డ్ జూనియర్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. ఆఫ్రికా వేదికగా జరిగిన టోర్నీలో అండర్-18 విభాగంలో బరిలోకి దిగిన పదిహేనేండ్ల శౌర్య నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో శౌర్య 2-6, 4-6తో డానియల్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
అంతకుముందు తొలి రౌండ్లో 6-1, 6-2తో రూబెన్‌పై, ప్రిక్వార్టర్స్‌లో 6-1, 6-3తో ఆంటోనీ బిక్జీపై, క్వార్టర్స్‌లో 6-4, 4-6, 6-3తో ఎమెర్సన్ పెడ్రోపై, సెమీఫైనల్లో 5-7, 6-2, 6-4తో రాబర్టో మటుండోపై గెలిచిన శౌర్య తుదిపోరులో అదే జోరు కొనసాగించలేకపోయాడు.