హైదరాబాద్: తెలంగాణ యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గువాహటి వేదికగా జరుగుతున్న 75వ జాతీయ సీనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో వ్రితి.. రజతం, కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల 800 మీటర్ల ఫ్రీైస్టెల్ రేసును 9:24:43 సెకన్ల టైమింగ్‌తో ముగించి రజతం దక్కించుకుంది. అదే దూకుడు కనబరుస్తూ 200మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌ను 2:24:37సెకన్లతో ముగించి కాంస్యం ఖాతాలో వేసుకుంది. ఇదే టోర్నీలో వ్రితి రెండు రజత పతకాలు సొంతం చేసుకుంది.