హైదరాబాద్, ఆట ప్రతినిధి: సురేంద్రసింగ్ స్మారక జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ షూటర్ సురభి భరద్వాజ్ రజత పతకంతో మెరిసింది. భోపాల్ వేదికగా జరిగిన పోటీల్లో మహిళల 50మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో సురభి 621.8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
అయితే రాజస్థాన్ షూటర్ మణిని కౌశిక్(621.9) పాయింట్లతో స్వర్ణం దక్కించుకోగా, కేవలం పాయింట్ తేడాతో సురభి పసిడి పతకాన్ని చేజార్చుకుంది. మరోవైపు మహిళల 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో సురభి 425.9 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. ఈ విభాగంలో ప్రియ (461.4) విదర్శ (461.1), మాణిని (448.6) పతకాలు కైవసం చేసుకున్నారు.