హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ షట్లర్ సాయి నచికేత్ భట్రాజు భారత బ్యాడ్మింటన్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో మెన్స్ అండర్19 టైటిల్ సొంతం చేసుకున్న దేశ తొలి ఆటగాడిగా నిలిచాడు.
మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన టాప్ సీడ్ నచికేత్ ఫైనల్లో 21-8, 21-15తో వరుస సెట్లలో భారత్‌కే చెందిన సుహాస్‌ను చిత్తు చేసి టైటిల్ గెలిచాడు.