ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న 2వ ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో గురువారం తెలంగాణ రెండు స్వర్ణాలతో సత్తా చాటింది. పారా టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్లో రాష్ర్టానికి చెందిన క్రీడాకారిణులు విజయదీపిక, నిషా బంగారు పతకాలతో మెరిశారు.
గురువారం టీటీ క్లాస్-8 ఈవెంట్ ఫైనల్లో నిషా ఇన్నాని.. 3-1తో సవిత (కర్నాటక)పై విజయం సాధించి స్వర్ణం గెలుచుకుంది. క్లాస్-4 విభాగంలో గంగపట్నం విజయదీపిక.. 3-0తో ఉషా రాథోడ్ (గుజరాత్)పై గెలిచి పసిడి నెగ్గింది. ఈ క్రీడల్లో తెలంగాణ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాం స్యాలతో ఏడు పతకాలు సాధించి పాయింట్ల పట్టికలో 11వ స్థానంలో నిలిచింది.