డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆదివారం జరిగిన మహిళల నెట్‌బాల్, మహిళల 4X100 మీటర్ల రిలేలో తెలంగాణ క్రీడాకారులు కాంస్యాలతో మెరిశారు. మహిళల 4X100 మీటర్ల రిలేలో నిత్య, సింధు, నంధిని, మైథిలితో కూడిన బృందం 47.58 సెకన్లలో రేసును పూర్తిచేసింది. కర్నాటకకు స్వర్ణం, కేరళకు రజతం దక్కాయి. ట్రెడీషనల్ నెట్‌బాల్‌లో తెలంగాణ అమ్మాయిలు బృందం.. ఉత్తరాఖండ్‌ను ఓడించి కాంస్యాన్ని సొంతం చేసుకుంది.