హైదరాబాద్, ఆట ప్రతినిధి: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న 76వ జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో తెలంగాణ 1-0 తేడాతో ఒడిశాపై అద్భుత విజయం సాధించింది. మ్యాచ్ 29వ నిమిషంలో సొలాయ్ మలాయ్ సూపర్ గోల్‌తో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి స్ట్రైకర్ల దాడులను సమర్థంగా తిప్పికొడుతూ ఐదు గోల్స్ అడ్డుకున్న గోల్‌కీపర్ ఇషాన్ సర్కార్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.