డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. బుధవారం జరిగిన మహిళల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో తెలంగాణకు కాంస్య పతకం దక్కింది. రాష్ట్రం తరఫున బరిలోకి దిగిన చికిత, మనసనయన, శేష్ఠ్రరెడ్డి, మన్సూర్ హసిబా 232 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది.
ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోటీల్లో తెలంగాణ ఆర్చర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇదే విభాగంలో పంజాబ్(228), మహారాష్ట్ర(227) ఆర్చర్లు వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. ఒక స్వర్ణం, మూడు కాంస్యాలతో తెలంగాణ ప్రస్తుతం 25వ స్థానంలో కొనసాగుతున్నది.