Telangana | హైదరాబాద్, ఆట ప్రతినిధి: జమ్ము కశ్మీర్ వేదికగా జరిగిన 23వ జాతీయ సబ్‌జూనియర్ వుషు చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్లు పతక జోరు కనబరిచారు. ఆరు రోజుల పాటు జరిగిన టోర్నీలో తెలంగాణ నుంచి మొత్తం 49 మంది ప్లేయర్లు పోటీపడగా, ఆరు పతకాలు సాధించారని అసోసియేషన్ కార్యదర్శి అబ్దుల్ ఒమర్ పేర్కొన్నారు.
వీరిలో సహస్రిక రజత పతకంతో మెరువగా, ఆకాంక్ష, వైష్ణవి, నిత్య, చార్విక్తేజ, అజైన్ కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నారు.