ఇషాసింగ్ పసిడి గురి
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో తెలంగాణ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది.
- జుహిత్, కాంతిశ్రీ జోడీకి కాంస్యం
- 36వ జాతీయ క్రీడలు
అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో తెలంగాణ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. పోటీల రెండో రోజైన శనివారం తెలంగాణకు స్వర్ణం సహా కాంస్య పతకం దక్కింది. స్టార్ షూటర్ ఇషాసింగ్ పసిడి వెలుగులు విరజిమ్మింది. మహిళల 25మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో ఇషాసింగ్ 26 పాయింట్లతో టాప్‌లో నిలిచి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఇదే విభాగంలో పోటీపడ్డ రితమ్ సాంగ్వాన్(25, హర్యానా), అబింద్యా అశోక్(19, మహారాష్ట్ర) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
క్వాలిఫయింగ్ పోటీల నుంచే తనదైన దూకుడు ప్రదర్శించిన 17 ఏండ్ల ఇషా రౌండ్ రౌండ్‌కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయింది. ప్రత్యర్థుల నుంచి దీటైన పోటీ ఎదురైనా వెనుకకు తగ్గకుండా కీలక పాయింట్లు ఖాతా లో వేసుకుంది. ఈ క్రమం లో క్వాలిఫయింగ్ పోటీలు ముగిసేసరికి ఇషా 584 పాయింట్లతో స్టార్ షూటర్ మనుభాకర్(583) కంటే ముందంజలో నిలిచి అగ్రస్థానం దక్కించుకుంది.
స్వర్ణ పతక విజయంపై ఇషా స్సందిస్తూ ‘నేషనల్ గేమ్స్‌లో పతకం గెలువడం ప్రత్యేకమైన సందర్భం. పోటీల తొలి దశలో కొంత ఒత్తిడికి గురైనా మళ్లీ పుంజుకున్నాను. నాలుగో సిరీస్ నుంచి కచ్చితమైన షాట్లతో పాయింట్లు సాధించాను. నా ఏకైక లక్ష్యం పారిస్(2024) ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే. ఇప్పటి వరకు నా ప్రదర్శనపై సంతృప్తితో ఉన్నాను’ అని అంది. మరోవైపు రోలర్ స్కేటింగ్ అర్టిస్టిక్ కపుల్ డ్యాన్సింగ్‌లో అనుపోజు కాంతిశ్రీ, జుహిత్కు కాంస్య పతకం లభించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

