హైదరాబాద్, ఆట ప్రతినిధి : జూనియర్ నేషనల్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు 4 పతకాలు సాధించారు. భువనేశ్వర్‌లో బుధవారం జరిగిన బాయ్స్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో చెందిన సుహాస్ ప్రీతమ్ స్వర్ణం నెగ్గాడు. ఫైనల్ రేసును 57.33 సెకండ్ల కెరీర్ బెస్ట్ టైమింగ్‌తో ముగించి అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు.
శ్రీనిత్య సాగి బాలికల 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లే విభాగంలో 5 నిమిషాల 19.15 సెకండ్లతో రజతం, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ రేసులో (1:08.37 ని) కాంస్యం గెలిచింది. అనికా దెబోరా బాలికల 50 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో (28.02 సె) మూడో స్థానంతో కాంస్యం ఖాతాలో వేసుకుంది.