హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాజ్‌కోట్ (గుజరాత్) వేదికగా జరుగుతున్న 68వ ఎస్జీఎఫ్ఐ జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్ల పతక హవా కొనసాగుతున్నది. బుధవారం జరిగిన బాలుర అండర్-17 విభాగంలో వర్షిత్ 4:47:78సెకన్ల టైమింగ్‌తో రజత పతకంతో మెరిశాడు. మరోవైపు బాలికల అండర్-17 కేటగిరీ 50మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో నిత్యకు కాంస్యం దక్కింది.