హైదరాబాద్, ఆట ప్రతినిధి: పారిస్ ఒలింపిక్స్లో పతకం సాధించడమే తన లక్ష్యమని తెలంగాణ స్టార్ షూటర్ ఇషాసింగ్ పేర్కొంది. శనివారం వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇషా మాట్లాడుతూ ‘విశ్వక్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాలన్న స్వప్నం నెరవేరింది. ప్రత్యర్థి షూటర్లతో పోటీపడుతూ పతకం సాధించడమే ఇక మిగిలి ఉంది.
ఏడేండ్లుగా పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది. ఒలింపిక్స్ ట్రయల్స్ కోసం పడిన శ్రమ ఇప్పటి వరకు ఎప్పుడు పడలేదు. పారిస్ విశ్వక్రీడల్లో పతకం సాధించి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడిస్తానన్న గట్టి నమ్మకం ఉంది’ అని అంది.