హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఈనెల 18 నుంచి 24 దాకా ఇటలీలో జరిగే వరల్డ్ స్కేట్ గేమ్స్-2024లో తెలంగాణ యువ క్రీడాకారులు ధృవీ
లఖోటియా, మోక్షిత్ రామ్‌రెడ్డి చోటు దక్కించుకున్నారు. ధృవీ స్కేట్‌బోర్డ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా మోక్షిత్ రోలర్ ఫ్రీైస్టెల్లో బరిలోకి
దిగనున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఈ గేమ్స్‌లో చోటు దక్కించుకున్నందుకు గాను కోచ్ జితేందర్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు.