హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ రోయింగ్ టోర్నీలో తెలంగాణకు మూడు కాంస్య పతకాలు దక్కాయి. చండీగఢ్ వేదికగా ఆదివారం ముగిసిన టోర్నీ పురుషుల లైట్ వెయిట్ కేటగిరీలో పోలీస్ జట్టుకు చెందిన ఆర్. రామకృష్ణ కాంస్య పతకం చేజిక్కించుకోగా.. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్కు చెందిన గణేశ్ కంచు మోత మోగించాడు. సబ్ జూనియర్ టీమ్ ఈవెంట్లో గణేశ్, సాయి వరుణ్, శ్రావ్య, ప్రసన్నతో కూడిన తెలంగాణ జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది. వీరంతా ద్రోణాచార్య అవార్డీ ఇస్మాయిల్ బేగ్ పర్యవేక్షణలో మన్జీత్ సింగ్ శిక్షణలో రాటుదేలారు.