హైదరాబాద్, ఆట ప్రతినిధి: మాస్కో (రష్యా) వేదికగా జరిగిన అంతర్జాతీయ వుషు టోర్నీలో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటారు. అద్భుత ప్రదర్శన కనబరుస్తూ పతకాలు కొల్లగొట్టారు.
సింగిల్ వెపన్ విభాగంలో ఫరియా ఖానమ్ స్వర్ణం దక్కించుకోగా, సద్దామ్ హుస్సేన్ రెండు కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నాడు. షేక్ రఫీయుద్దీన్, షేక్ తబ్రెజ్, శివ మహేశ్ వేర్వేరు విభాగాల్లో కాంస్య పతకాలు దక్కించుకున్నారు.