కొచ్చి: కేరళ వేదికగా జరుగుతున్న 28వ జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ టోర్నీలో తెలంగాణ పతక జోరు కొనసాగుతున్నది. పోటీల రెండో రోజైన మంగళవారం యువ అథ్లెట్ అగసర నందిని పసిడి పతకంతో మెరిసింది.
మహిళల హెప్టాథ్లాన్‌లో బరిలోకి దిగిన నందిని మొత్తం 5813 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. 100మీ హర్డిల్స్ (13.75సె), హైజంప్ (1.65మీ), షాట్‌పుట్ (13.49మీ), 200మీ (23.63సె), లాంగ్‌జంప్ (6.01మీ), జావెలిన్‌త్రో (32.38మీ), 800మీ (2:15:70సె) విభాగాల్లో నందిని అద్భుత ప్రదర్శన కనబరిచింది.