హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) వేదికగా జరుగుతున్న 10వ తెలంగాణ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. గురువారం మొదలైన టోర్నీలో బాలికల అండర్-20 800మీటర్ల రేసులో కల్యాణి 2:35:09సెకన్ల టైమింగ్‌తో పసిడి పతకంతో మెరిసింది.
ఇదే విభాగంలో టబు(కొత్తగూడెం), పూజ(నిర్మల్) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. బాలుర అండర్-18 లాంగ్‌జంప్‌లో నల్లగొండకు చెందిన సపావత్ దాతు 6.69మీటర్లు దూకి స్వర్ణం ఖాతాలో వేసుకున్నాడు. అశోక్(6.67మీ), సుబ్బు(6.13మీ) రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్, సాట్స్ సంయుక్తంగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నాయి.