ఆలిండియా వాలీబాల్ టోర్నీలో తెలంగాణ జోరు

హైదరాబాద్, సెప్టెంబర్21(నమస్తే తెలంగాణ): ఆలిండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ టోర్నీలో తెలంగాణ సచివాలయ ఉద్యోగులు వరుస విజయాలతో అదరగొట్టారు. హర్యానాలోని కురుక్షేత్ర ద్రోణాచార్య స్టేడియంలో మంగళవారం తొలుత జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 25-21, 25-22 తేడాతో చత్తీస్‌గఢ్‌పై విజయం సాధించింది. అదే జోరు కొనసాగిస్తూ రెండో మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌పై 25-19, 25-17తో తెలంగాణ విజయదుందుభి మోగించింది. మరోవైపు టోర్నీలో తొలిసారి పోటీపడ్డ ఏపీ మహిళల టీమ్ 2-1తేడాతో ఆర్ఎస్బీపై గెలిచింది. ఈ టోర్నీలో ఉద్యోగులు పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని జీఏడీ ఏఎస్వో చిట్టిబాబు పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

