న్యూఢిల్లీ: ఈ ఏడాది చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలకు తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న మెగాటోర్నీ కోసం అఖిల భారత చెస్ సమాఖ్య ఆదివారం 10 మందితో కూడిన జట్టును ప్రకటించింది. పురుషుల విభాగంలో విదిత్ గుజరాతి, గుకేశ్, హరికృష్ణ, ప్రజ్ఞానందతో కలిసి అర్జున్ బరిలోకి దిగనుండగా..
మహిళల విభాగంలో రెండు సార్లు ఆసియా స్వర్ణ పతక విజేత కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక పోటీ పడుతున్నారు. గత రెండు ఏషియన్ గేమ్స్ (2014, 2018)లో చదరంగం పోటీలు నిర్వహించలేదు. 2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల అనంతరం 13 ఏండ్ల సుదీర్ఘ బ్రేక్ తర్వాత మళ్లీ చెస్‌ను మెగాటోర్నీలో ప్రవేశపెట్టారు.