బాకు: తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరగైసికి ఫిడే ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో నిరాశ ఎదురైంది. ఈ మెగాటోర్నీలో తొలిసారి నలుగురు భారత ప్లేయర్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరి రికార్డు సృష్టించగా.. గురువారం జరిగిన క్వార్టర్స్ పోరులో అర్జున్ 4-5తో భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద చేతిలో పరాజయం పాలయ్యాడు.
ఈ విజయంతో 17 ఏండ్ల ప్రజ్ఞానంద సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. తొలి గేమ్‌లో ఆధిక్యం కనబర్చిన అర్జున్.. టై బ్రేక్ సడెన్ డెత్‌లో ఓడాడు. మరోవైపు గుకేశ్, విదిత్ కూడా ఇంటిబాట పట్టగా.. ఇప్పుడు ఈ టోర్నీలో భారత్ తరఫు నుంచి ప్రజ్ఞానంద ఒక్కడే పోటీలో ఉన్నాడు.