Telangana | హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు చాంపియన్‌గా నిలిచింది. బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్లో తెలంగాణ 24-23తేడాతో కేరళపై గెలుపొందింది.
ఆద్యాంతం హోరాహోరీగా సాగిన తుదిపోరులో మన అమ్మాయిలు ఉత్కంఠను అధిగమించి విజయం సాధించారు. అద్వితీయ ప్రదర్శన కనబర్చిన మన జట్టును రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సంఘం ప్రతినిధులు శోభన్‌బాబు అభినందించారు.