హైదరాబాద్, ఆట ప్రతినిధి: చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్‌కు తెలంగాణ స్టార్ ఫుట్‌బాలర్ గుగులోతు సౌమ్య ఎంపికైంది. హంగ్జులో జరిగే మెగాటోర్నీ కోసం అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య ఎంపిక చేసిన మహిళల సీనియర్ జట్టులో సౌమ్య చోటు దక్కించుకుంది.
నిజామాబాద్‌కు చెందిన సౌమ్య.. భారత్ తరఫున ఆసియా క్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి తెలంగాణ ప్లే యర్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకుంది.