ఇస్లే ఆఫ్ మ్యాన్ : ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నీలో తెలంగాణ కుర్రాడు అర్జున్ ఎరిగేసి అదరగొడుతున్నాడు. గ్రాండ్‌మాస్టర్ అర్జున్ తన వ్యూహాత్మక ఎత్తులతో శుక్రవారం అంటోన్ గిజార్రో(స్పెయిన్)పై అద్భుత విజయం సాధించాడు. నల్లపావులతో ఆడిన అర్జున్ ఒకదశలో వెనకబడినా.. వెంటనే పుంజుకొని ప్రత్యర్థి ఆట కట్టించాడు. ఇక ఎస్ఎల్ నారయణన్ రెండో రౌండ్లో ఉజ్బెకిస్థాన్ గ్రాండ్‌మాస్టర్ అబ్దుసత్తోరోవ్ నొడిర్బికెతో హోరాహోరాగా తలపడినప్పటికీ డ్రాతో సరిపెట్టుకున్నాడు.