హైదరాబాద్, ఆట ప్రతినిధి : నారాయణ్‌పూర్(చత్తీస్‌గఢ్) వేదికగా జరుగుతున్న 79వ సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 2-1తో చత్తీస్‌గఢ్‌పై అద్భుత విజయం సాధించింది.
చివరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో తెలంగాణ తరఫున సయ్యద్ అహ్మద్(47ని), ఇమ్రాన్ అలీ(59ని) ఒక్కో గోల్ చేశారు. అశోక్ కుంజుర్(80ని) చత్తీస్‌గఢ్‌కు ఏకైక గోల్ అందించాడు.