టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్ 12 చివరి మ్యాచ్‌లో నమీబియాపై భారత్ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో ఇంకా 28 బంతులు మిగిలి ఉండగానే భారత్ గెలిచింది. 15.2 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేసింది. అయితే.. భారత్‌ను ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఆదుకున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేయడంతో భారత్ సునాయసంగా నమీబియాపై విజయం సాధించింది.
కేఎల్ రాహుల్ 36 బంతుల్లో 54 పరుగులు చేసి నాట్ అవుట్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ 37 బంతుల్లో 56 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా చెలరేగి ఆడాడు. 19 బంతుల్లో 25 పరుగులు చేశాడు. నమీబియా బౌలర్లలో ఫ్రైలింక్ ఒక వికెట్ తీశాడు.
4 ఓవర్లు వేసి కేవలం 16 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసిన రవీంద్ర జడెజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండు రికార్డులు క్రియేట్ చేశాడు. టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 3000 మైలురాయిని క్రాస్ చేశాడు. అలాగే.. హాఫ్ సెంచరీ చేసి మరో రికార్డు సృష్టించాడు.
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిచినా.. టీమిండియా.. టీ20 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్స్‌కు వెళ్లలేకపోయింది. దీంతో ఈ టోర్నీలో మధ్యలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. టీ20 ఇంటర్నేషనల్‌లో కెప్టెన్‌గా తనకు ఇదే చివరి టోర్నీ అని విరాట్ కోహ్లీ ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో జరిగే టీ20 ఇంటర్నేషనల్ టోర్నీలలో కోహ్లీ కెప్టెన్‌గా ఉండడు.
India sign off from the #T20WorldCup in style 👏 #INDvNAM | https://t.co/ICh1BVKEFJ pic.twitter.com/7Qg7J38ppW
— T20 World Cup (@T20WorldCup) November 8, 2021
Another classy knock from the Indian opener 🙌#T20WorldCup | #INDvNAM | https://t.co/ICh1BVKEFJ pic.twitter.com/fQmV3fE1Wb
— T20 World Cup (@T20WorldCup) November 8, 2021
A knock full of fireworks from the Hitman 💥#T20WorldCup | #INDvNAM | https://t.co/ICh1BVKEFJ pic.twitter.com/MHeYIqMhLj
— T20 World Cup (@T20WorldCup) November 8, 2021
3⃣0⃣0⃣0⃣ runs in Men's T20Is 👏
— T20 World Cup (@T20WorldCup) November 8, 2021
Rohit Sharma, take a bow 🙇♂️#T20WorldCup | #INDvNAM | https://t.co/ICh1BVKEFJ pic.twitter.com/gZMfKg0r5F