TeamIndia : శ్రీలకంతో టీ20 ఫైనల్ పోరుకు భారత్ సిద్ధమైంది. ఇరుజట్లు చెరొక మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉండనుంది. ఇది టీమిండియాకు 14 టీ20 సిరీస్ ఫైనల్. అయితే… ఇప్పటివరకూ జరిగిన టీ20 సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు మెరుగైన రికార్డు ఉంది. సొంతగడ్డ మీద అయినా, విదేశీ పర్యటనలో అయినా సరే విజయం మాత్రం భారత్‌దే. 13 ఫైనల్స్ ఆడిన భారత్ ఏకంగా పదింటిలో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. రెండు మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయింది. పోయిన ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ డిసైడర్‌లో ఫలితం తేలలేదు. టీ20 సిరీస్ డిసైడర్ అయిన ఫైనల్ మ్యాచ్‌లో వివిధ జట్లపై భారత్ రికార్డు ఇది..
2016లో ఆతిథ్య శ్రీలకంతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 9 వికెట్లతో విజయం సాధించింది. రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అదే ఏడాది జింబాబ్వే పర్యటనలో సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో ఇండియా 3 పరుగుల తేడాతో గెలిచింది. 2017లో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌పై భారత్ కీలకమైన మూడో టీ20 గెలిచి సిరీస్ అందుకుంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌తో 2018లో జరిగిన టీ20 సిరీస్ ఫైనల్లో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. 2019లో న్యూజిలాండ్, బంగ్లదేశ్, వెస్టిండీస్ జట్లతో తలపడిన టీ20 ఫైనల్లో భారత జట్టు గెలుపొందింది. 2021లో ఇంగ్లండ్, శ్రీలంకతో జరిగిన సిరీస్ ఫైనల్లో, పోయిన ఏడాది ఆస్ట్రేలియాపై కూడా ఇండియా ఘన విజయం సాధించింది. ఎంఎస్.ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20ల్లో భారత్ విజయాల పరంపర కొనసాగించింది.
India In T20I Series Decider
Won v SL (2016)
Won v Zim (2016)
Won v Eng (2017)
Won v NZ (2017)
Won v SA (2018)
Won v Eng (2018)
Lost v NZ (2019)
Won v Ban (2019)
Won v WI (2019)
Won v ENG (2021)
Lost v SL (2021)
Drawn v SA (2022)
Won v AUS (2022)
v SL (Today)#INDvSL— CricBeat (@Cric_beat) January 7, 2023