అహ్మదాబాద్: ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్న టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. ఆటేతర అంశాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో గిల్ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని వార్తలు రాగా.. ఆ తర్వాత సారా టెండూల్కర్ స్థానంలో సారా అలీఖాన్ వచ్చి చేరింది. ఇక తాజాగా మరోసారి గిల్ పేరు మారుమోగుతున్నది.
ఓ ఇంటర్వ్యూ సందర్భంగా గిల్ తనకు ప్రముఖ హీరోయిన్ రష్మిక మంధనపై క్రష్ ఉందని పేర్కొన్నట్లు వార్తలు వైరల్‌గా మారాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప చిత్రం ద్వారా రష్మిక బాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు నేషనల్ క్రష్ గుర్తింపు సాధించింది. అయితే ఈ వైరల్ పోస్ట్‌పై గిల్ స్వయంగా స్పందించాడు. ‘ఏ మీడియా ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడైంది. నాకైతే దీని గురించి తెలియదే’ అని గిల్ పోస్ట్ చేశాడు. భారత క్రికెటర్లు సినీ తారలతో ప్రేమలో పడటం కొత్తేమి కాకపోయినా.. గిల్ మాత్రం తాను నోరు తెరవక ముందే తన పేరును అన్నిట్లో రుద్దుతున్నారనే విధంగా స్పందించాడు.