పాక్‌ను పడగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించిన టీమిండియా..
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో భారీ విజయం దక్కించుకున్న రోహిత్ సేన టీ20లలో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో భారీ విజయం దక్కించుకున్న రోహిత్ సేన టీ20లలో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా గతంలో పాకిస్తాన్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టడమే గాక నయా చరిత్రను లిఖించింది.
హైదరాబాద్‌లో మ్యాచ్ గెలవడం ఈ క్యాలెండర్ ఈయర్‌లో టీమిండియాకు టీ0లలో 21వ సారి. తద్వారా 2021లో పాకిస్తాన్ పేరిట ఉన్న అత్యధిక విజయాల (20) రికార్డును టీమిండియా అధిగమించింది. దీంతో ఒక ఏడాది టీ20లలో 21 విజయాలు నమోదు చేసిన తొలి పురుషుల జట్టుగా కొత్త చరిత్ర సృష్టించింది.
మహిళల క్రికెట్లో ఈ రికార్డు థాయ్‌లాండ్ ఉమెన్స్ టీమ్ పేరిట ఉంది. థాయ్‌లాండ్ మహిళా క్రికెట్ జట్టు.. 2019లో 25 మ్యాచ్‌లు ఆడి 21 విజయాలు సాధించి నాలుగింటిలో మాత్రమే ఓడింది.
పాకిస్తాన్ రికార్డును బద్దలుకొట్టడంతో పాటు ఈ మ్యాచ్‌లో విజయం ద్వారా రోహిత్ శర్మ.. టీ20లలో అత్యధిక విజయాలు అందుకున్న రెండో భారత సారథిగా నిలిచాడు. ఈ జాబితాలో ఎంఎస్ ధోని 42 విజయాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత రోహిత్ శర్మ 33 విజయాలు సాధించాడు. మూడో స్థానంలో కోహ్లీ ఖాతాలో 32 విజయాలున్నాయి.
Most T20I Wins in a Year
21* – 🇮🇳, 2022
20 – 🇵🇰, 2021
17 – 🇵🇰, 2018
16 – 🇺🇬, 2016
15 – 🇿🇦, 2021#INDvAUS #TeamIndia— Akhil Gupta 🏏 (@Guptastats92) September 25, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

