పెర్త్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టులో భారత్-ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. పెర్త వేదికగా (Perth Test) జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ బుమ్రా.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆసిస్ బౌలర్ల ధాటికి స్వల్ప స్మోరుకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహూల్‌తో కలిసి ఓపెనింగ్‌కు దిగిన యశస్వీ జైస్వాల్ ఒక్క పరుగూ చేయకుండానే వెనుతిరిగాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో నాథన్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్‌కు చేరాడు. ఇక వన్‌డౌన్‌గా వచ్చి దేవ్‌దత్ పడిక్కల్ 23 బంతులు ఎదుర్కొన్నప్పటికీ ఖాతా తెరువలేకపోయాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం సీనియర్ బ్యాటర్లు రాహుల్ (53 బంతుల్లో 14 పరుగులు), కోహ్లీ (9 బాల్స్‌లో 2 రన్స్) క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, ఈ మ్యాచ్‌తో టీమ్ఇండియా తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఆంధ్ర ప్లేయర్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణా తమ డెబ్యూ క్యాప్‌లు అందుకున్నారు. తుది జట్టులో అశ్విన్‌కు చోటు దక్కలేదు. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగాడు. రోహిత్ శర్మ గైర్హాజరీతో రాహుల్ ఓపెనింగ్ చేశాడు.
ఇరు జట్లు..
టీమ్ ఇండియా: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (WK), ధృవ్ జురెల్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా (c), మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్), పాట్ కమిన్స్ (సి), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్.
1ST Test. WICKET! 16.2: Virat Kohli 5(12) ct Usman Khawaja b Josh Hazlewood, India 32/3 https://t.co/dETXe6cqs9 #AUSvIND
— BCCI (@BCCI) November 22, 2024