Team Indiaw Vs WIw | వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో టీమిండియా మహిళా జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా మూడు టీ-20 మ్యాచ్ ల సిరీస్ 1-1 పాయింట్లతో సమమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.
160 పరుగుల విజయ లక్ష్యాన్ని వెస్టిండీస్ 15.4 ఓవర్లలో ఒకే ఒక వికెట్ కోల్పోయి సునాయాసంగా చేధించింది. వెస్టిండీస్ ఓపెనర్ హేలీ మాథ్యూస్ 47 బంతుల్లో 17 ఫోర్లతో 85 పరుగులు, క్వినా జోసెఫ్ 22 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 38 పరుగులు చేశారు. హేలీ మాథ్యూస్, క్వినా జోసెఫ్ లతో కూడిన ఓపెనర్ల జోడీ తొలి వికెట్ భాగస్వామ్యానికి 66 పరుగులు జోడించారు. క్వినా జోసెఫ్ ఔటైన తర్వాత షెమైన్ 26 బంతుల్లో నాలుగు ఫోర్లతో 29 పరుగులు చేసింది. దీంతో హేలీ మాథ్యూస్ సారధ్యంలోని వెస్టిండీస్ జట్టుకు భారీ విజయం లభించింది.
ఈ సిరీస్ లో నిర్ణయాత్మక మూడో టీ-20 మ్యాచ్ గురువారం జరుగుతుంది. ఇక టాస్ ఓడిపోయిన టీం ఇండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. స్మృతి మందాన 41 బంతుల్లో ఒక సిక్సర్, తొమ్మిది ఫోర్లతో 62 పరుగులతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, చివర్లో రిచాఘోస్ 17 బంతుల్లో ఆరు ఫోర్లతో 32 పరుగులు చేశారు. జెమీమా రోడ్రిగ్స్ 13, దీప్తి శర్మ 17 పరుగులు చేశారు.