దుబాయ్ : వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా మూడో స్థానానికి పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా టాప్ ర్యాంకర్ ఆస్ట్రేలియాకంటే మూడు పాయింట్లు వెనుకంజలో ఉంది. కాగా పాకిస్థాన్ రెండో స్థానంలో నిలిచింది.
అయిదుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా తమ రేటింగ్‌ను 113నుంచి 118 పాయింట్లకు పెంచుకుని అగ్రస్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్(116), ఇండియా(115) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నెలలో కివీస్‌పై సిరీస్ గెలిచిన పాకిస్థాన్ రెండోస్థానానికి ఎగబాకింది.