Asia Cup : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా కప్ (Asia Cup) మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో ఎప్పటిలానే భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ఎనిమిది టైటిళ్లతో రికార్డు నెలకొల్పిన టీమిండియా మరోసారి ట్రోఫీపై కన్నేసింది. ఈసారి టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ జరుగుతున్నందున సూర్యకుమార్ యాదవ్(Suraykumar Yadav) కప్ కొట్టడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఆసియా జట్ల పాలిట సింహస్వప్నంలా మారిన టీమిండియా విజయ ప్రస్థానమిది.
ఆసియా దేశాల మధ్య జరిగే ఈ కప్‌లో ఆదినుంచి భారత జట్టు తిరుగులేని రికార్డు కొనసాగిస్తోంది. ఆసియా వరల్డ్ కప్‌గా పేరొందిన ఈ టోర్నీ ఆరంభ సీజన్ (1984)లోనే ఛాంపియన్‌గా అవతరించింది టీమిండియా. ఆ తర్వాత కూడా తమ జోరు చూపిస్తూ ఏకంగా ఎనిమిసార్లు టైటిల్ విజేతగా నిలిచింది. ఇందులో ఏడు వన్డే ఫార్మాట్లో జరుగగా.. ఒకటి టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. మొత్తంగా .. 1984, 1988, 1990/91, 1995, 2010, 2016, 2018, 2023లో ఛాంపియన్‌గా ట్రోఫీని అందుకుంది భారత్. శ్రీలంక జట్టు ఆరు ట్రోఫీలతో రెండో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ మూడుసార్లు మాత్రమే విజేత అయింది.
ఆసియా దేశాలకు ప్రత్యేకంగా ఒక ట్రోఫీ ఉండాలనే ఉద్దేశంతో 1984లో ఆసియా కప్‌ను ప్రారంభించారు. ఆ ఏడాది ఈ ఈవెంట్‌కు యూఏఈ ఆతిథ్యం ఇవ్వగా మూడు జట్లు మాత్రమే పాల్గొన్నాయి. భారత్, శ్రీలంక, పాకిస్థాన్ టైటిల్ కోసం పోటీపడగా.. సునీల్ గవాస్కర్ నేతృత్వంలోని భారత్ ఫైనల్లో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 1986లో దిలీప్ వెంగ్‌సర్కార్ కెప్టెన్సీలోని భారత్ దాయాది పాకిస్థాన్‌కు చెక్ పెట్టి రెండోసారి టైటిల్‌ను అందుకుంది.
Just a reminder ,we won Asia cup 2023 under Rohit Sharma captaincy 🧿!!pic.twitter.com/GHX6vezNOU
— ” (@Sneaky_ix) November 18, 2023
అజారుద్దీన్ నాయకత్వంలో 1990, 1995లో కప్‌ను తన్నుకుపోయింది టీమిండియా.2010లో ఎంఎస్ ధోనీ జట్టుకు ఆసియా కప్‌ను సాధించిపెట్టాడు. మళ్లీ.. మహీభాయ్ కెప్టెన్సీలోనే టీమిండియా 2016లో ఛాంపియన్‌గా నిలిచింది. అనంతరం 2018లో టీమిండియాకు ట్రోఫీ కట్టబెట్టిన రోహిత్ శర్మ.. 2023లోనూ టైటిల్ అందించాడు. దాంతో.. భారత్ ఖాతాలో ఎనిమిదో ఆసియా కప్ చేరింది.