లార్డ్స్: ఇండియా, ఇంగ్లండ్(ENG Vs IND) మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇవాళ్టి నుంచి అయిదో టెస్టు జరగనున్న విషయం తెలిసిందే. అయితే లార్డ్స్‌లో జరిగిన కీలకమైన మూడవ టెస్టులో వివాదస్పద ఘటన చోటుచేసుకున్నది. బంతిని మార్చే అంశంలో వివాదం చెలరేగినట్లు టీమిండియా ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది. ఆ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో.. పది ఓవర్లకే బంతి షేప్ మారింది. ఆకారం చెడి పోవడంతో మరో బంతి తీసుకోవాల్సి వచ్చింది. అయితే రీప్లేస్మెంట్లో భాగంగా అంతే పాత బంతిని అంపైర్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ తప్పు జరిగినట్లు టీమిండియా క్రికెటర్లు ఆరోపిస్తున్నారు.
పది ఓవర్ల బంతి స్థానంలో 35 ఓవర్లు ఆడిన పాత బంతిని ఇచ్చినట్లు పేర్కొన్నారు. బంతి మరీ పాతది కావడం వల్ల.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లను ఈజీగా ఔట్ చేయలేకపోయారు. అప్పటి వరకు ఆధిపత్యం చాటిన ఇండియా.. 35 ఓవర్లు ఆడిన బంతిని తీసుకోవడం వల్ల స్మిత్‌ను ఈజీగా ఔట్ చేయలేకపోయింది. దీంతో అతను చెలరేగిపోయాడు.
వాస్తవానికి 10 ఓవర్లకు చెడిన బంతి స్థానంలో.. అంతే పాత బంతిని ఇవ్వాలి. కానీ టీమిండియా అభ్యర్థనను ఇంగ్లండ్ పట్టించుకోలేదని తెలుస్తోంది. రెండో బంతి తీసుకున్న తర్వాత స్వింగ్ లేకపోవడం వల్ల.. ఓ దశలో 10 ఓవర్లు వాడిన బంతినే ఇవ్వాలని అడిగారు. కానీ ఐసీసీ రూల్స్ ప్రకారం ఆ రిక్వెస్ట్ వర్కౌట్ కాలేదు.
పది ఓవర్లు ఆడిన బంతి సగటున 1.869 డిగ్రీల స్వింగ్, 0.579 డిగ్రీల సీమ్ మూమెంట్ ఇస్తోంది. కానీ రిప్లేస్మెంట్ బంతి కేవలం 0.855 డిగ్రీల స్వింగ్ మాత్రమే ఇచ్చినట్లు టీమిండియా ఫిర్యాదు చేసింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 22 రన్స్ తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. దాంతో సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యాన్ని సాధించింది. ఇక నాలుగవ టెస్టు డ్రా అయ్యింది.