India Vs SA ODI | రాంచీలో జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా బ్యాటర్లు ఇషాన్ కిషాన్, శ్రేయాస్ అయ్యర్ నిలకడగా ఆడుతున్నారు. 25 ఓవర్లు ముగిసే సరికి టీం ఇండియా 138 పరుగులు చేసింది. మూడో వికెట్ భాగస్వామ్యానికి ఇషాన్ కిషాన్, శ్రేయస్ అయ్యర్ 91 పరుగులు జత చేశారు. వీలు చిక్కినప్పుడు ఫోర్లు, సిక్సర్లు కొడుతూ.. సింగిల్స్ తీస్తూ జట్టు స్కోర్‌ను ముందుకు నడిపించేందుకు ఇషాన్, శ్రేయస్ జోడీ ప్రయత్నిస్తున్నది. శ్రేయాస్ అయ్యర్ 45, ఇషాన్ కిషాన్ 49 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
అంతకుముందు రాంచీలో జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా తొమ్మిది ఓవర్లు ముగిసే లోపు ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు. తొమ్మిదో ఓవర్లో రబడా తాను వేసిన ఐదో బంతినే అద్భుతంగా క్యాచ్ పట్టడంతో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ క్రీజ్‌ను వదిలేయాల్సి వచ్చింది. అప్పటికి ఆయన వ్యక్తిగత స్కోర్ 28 పరుగులు.. కాగా, పదో ఓవర్ తొలి బంతిని ఆడిన శ్రేయస్ అయ్యర్ ఫోర్‌గా మలచడంతో టీం ఇండియా స్కోర్ ఫిఫ్టీ మార్క్ చేరుకుంది.
శుభ్‌మన్ గిల్‌తోపాటు ఓపెనర్‌గా వచ్చిన సారధి శిఖార్ ధావన్ మరోమారు విఫలం అయ్యాడు. 279 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సిన టీం ఇండియా బ్యాట్స్మన్లు దూకుడుగా ముందుకెళ్లలేకపోతున్నారు. తొలి వన్డేలో మాదిరిగానే రెండో వన్డేలోనూ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి శిఖార్ ధావన్ వ్యక్తిగత స్కోర్ 13 పరుగులు. టీం ఇండియా స్కోర్ 28 పరుగులుగా నమోదైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసి.. టీం ఇండియా ముందు 279 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. 40 ఓవర్లకే ఓపెనర్లు (క్వింటాన్ డికాక్ 5, జన్నేమాన్ మలాన్ 25) పెవిలియన్ బాట పట్టడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను రీజా హెండ్రిక్స్, అడైన్ మార్క్రమ్ చేపట్టారు. మూడో వికెట్ భాగస్వామ్యానికి 129 పరుగులు జత చేశారు. రీజా హెండ్రిక్స్ 74, అడెన్ మార్క్రమ్ 79 పరుగులతో జట్టును ఆదుకున్నారు.