హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ జిల్లాల క్రికెట్ అసోసియేషన్(టీడీసీఏ) వన్డే టోర్నీలో పాంథర్స్ ప్లేయర్ పృథ్వీశ్వర్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలుత పృథ్వీశ్వర్(104) సెంచరీకి తోడు అభినవ్(65), మణీశ్వర్(58) రాణించడంతో పాంథర్స్ టీమ్ 45.1 ఓవర్లలో 296కు ఆలౌటైంది. ఛేదనలో రైజర్స్ 36.5 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది.