Magnus Carlsen | కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. గురువారం జరిగిన మూడు వేర్వేరు గేముల్లో ఎస్ఎల్ నారాయణన్, వెస్లీ, ఇరిగేసి అర్జున్‌పై విజయాలతో కార్ల్సన్ 5 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. నోదిర్బె అబ్దుసత్రోవ్ (4.5), వెస్లీ (3.5), డానియల్ దబోవ్, ప్రజ్ఞానంద (3), నారాయణన్, విన్సెంట్ కెయ్మర్ (2.5), అర్జున్, నిహాల్ సరిన్, విదిత్ గుజరాతీ (2) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.
మరోవైపు మహిళల విభాగంలో అలెగ్జాండ్రా గోర్చెంకా (5), నాన దజింగే (4), వంతిక, హారిక, గునైనా (3.5) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.