బ్యాంకాక్ : హైదరాబాదీ షట్లర్ తరుణ్ మన్నెపల్లి థాయ్‌లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్‌లో క్వార్టర్స్‌కు చేరాడు. పురుషుల సింగిల్స్‌లో తరుణ్.. 21-17, 14-21, 24-22తో టింగ్ యెన్ చెన్ (చైనీస్ తైపీ)ను చిత్తుచేశాడు. 78 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన పోరులో రెండో గేమ్‌ను కోల్పోయినా ఉత్కంఠగా సాగిన నిర్ణయాత్మక మూడో గేమ్‌ను గెలుచుకుని క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. కానీ కిరణ్ జార్జి, మిథున్ మంజునాథ్ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టారు.
ఏడో సీడ్ జార్జి.. 11-21, 16-21తో ప్రహ్ద్సిక షుజివొ (ఇండోనేషియా) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్‌లో ఇషారాణి.. 21-13, 14-21, 21-14తో రెండో సీడ్ సుంగ్ షువొ యున్ (చైనీస్ తైపీ)ని మట్టికరిపించగా దేవికా సిహాగ్.. 21-14, 21-14తో టుంగ్ సియొ టాంగ్ (చైనీస్ తైపీ)ను వరుస సెట్లలో ఓడించి క్వార్టర్స్ చేరారు. కానీ శ్రీయాన్షి.. 17-21, 22-20, 19-21తో కరుపతెవన్ (మలేషియా) చేతిలో పోరాడి ఓడింది. అన్మోల్ సైతం 21-10, 19-21, 19-21తో హువాంగ్ (చైనీస్ తైపీ) జోరుకు పరాభవం పాలైంది.