SAW vs BANW : వరల్డ్ కప్‌లో తొలి సెంచరీతో రికార్డులు బ్రేక్ చేసిన తంజిమ్ బ్రిట్స్ (౦) తేలిపోతోంది. న్యూజిలాడ్పై విధ్వంసక శతకంతో రెచ్చిపోయిన తను తర్వాత నుంచి ఫ్లాప్ షో కొనసాగిస్తోంది. భారత్‌పై డకౌట్ అయిన ఈ డాషింగ్ ఓపెనర్.. మరోసారి సున్నాకే ఔటయ్యింది. బంగ్లాదేశ్ స్పిన్నర్ నహిదా అక్తర్ ఓవర్లో ఆమెకే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది బ్రిట్స్. దాంతో.. 3 పరుగులకే సఫారీ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ లారా వొల్వా్ర్డ్త్(6 నాటౌట్), అన్నెకె బాస్చ్ (1 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. మూడు ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్..7/1.
వైజాగ్ స్టేడియంలో బంగ్లాదేశ్‌ను 232 పరుగులకే కట్టడి చేసిన దక్షిణాఫ్రికా భారీ విజయంపై కన్నేసింది. కానీ, రెండో ఓవర్లోనే సఫారీలకు షాక్ తగిలింది. స్పిన్నర్ నహిదా అక్తర్ కు చేతికి బంతి అందించిన నిగర్ సుల్తానా ఫలితం రాబట్టింది. నేరుగా ఆడిన బ్రిట్స్.. అక్తర్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చింది. సఫారీల ప్రధాన బ్యాటర్ అయిన బ్రిట్స్ న్యూజిలాండ్‌పై సెంచరీ మినహాయిస్తే ఈ వరల్డ్ కప్లోపెద్దగా రాణించడం లేదు. తొలి పోరులో ఇంగ్లండ్‌పై 5 పరుగులే చేసిన తను.. భారత్‌పై సున్నాకే ఔటయింది. ఇప్పుడు బంగ్లాదేశ్‌పైన కూడా గోల్డెన్ డక్‌గా వికెట్ సమర్పించుకుంది.
THE HUNDRED CELEBRATION OF TANZIM BRITS. pic.twitter.com/UPYcT77Qcs
— maddyCric (@imRaghav001) October 7, 2025