BAN vs AFG : ఆసియా కప్ సూపర్ 4 రేసులో ఉన్న బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేసింది. అఫ్గనిస్థాన్ బౌలర్లను కాచుకున్న ఓపెనర్ తంజిద్ హసన్ (52) అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నాడు. మిడిల్ ఓవర్లలో అఫ్గన్ స్పిన్నర్లు కట్టడి చేసినా తౌహిద్ హ్రిదోయ్ (26) రాణించడంతో బంగ్లా స్కోర్ 130 దాటింది. డెత్ ఓవర్లలో గత మ్యాచ్ హీరో జకీర్ అలీ(12 నాటౌట్), నురుల్ హసన్(12 నాటౌట్)లు బ్యాట్ ఝులిపించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. సైఫ్ హసన్(), తంజిద్ హసన్()లు ధనాధన్ ఆడుతూ పవర్ ప్లేలో బౌండరీల మోత మోగించారు. గజన్ఫర్ ఓవర్లో తంజిమ్ సిక్సర్ బాదడంతో ఆరు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 59 రన్స్ కొట్టింది బంగ్లా. దంచేస్తున్న ఈ ద్వయాన్ని రషీద్ ఖాన్ విడదీసి అఫ్గనిస్థాన్‌కు బ్రేకిచ్చాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ లిటన్ దాస్(9) నిరాశ పరిచాడు. 87కే రెండు వికెట్లు పడిన వేళ.. తౌహిద్ హ్రిదయ్(26)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు తంజిద్.
Afghanistan put the brakes on Bangladesh just as they were trying to capitalise after a solid start. Is 154 going to be enough? #AFGvBAN
Follow live on the ESPNcricinfo app ➡️ https://t.co/nXpVJKiTrG pic.twitter.com/iGjiz0Gi65
— ESPNcricinfo (@ESPNcricinfo) September 16, 2025
ఘజన్ఫర్ ఓవర్లో సింగిల్ తీసిన తంజిద్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. నూర్ అహ్మద్ వేసిన 13వ ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచి జట్టు స్కోర్ 100కు చేర్చాడు హ్రిదోయ్. అయితే.. అదే ఓవర్లో తంజిద్ ఔట్ కావడంతో బంగ్లా స్కోర్ నెమ్మదించింది. కాసేపటికే షమీమ్ హసన్(11), హ్రిదోయ్ పెవిలియన్ చేరగా.. జకీర్ అలీ(12 నాటౌట్), నురుల్ హసన్(12 నాటౌట్)లు డెత్ ఓవర్లలో ధనాధన్ ఆడారు. దాంతో.. అఫ్గన్‌కు బంగ్లా 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.