శ్రీరాంపూర్: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియంలో జాతీయ స్థాయి 41వ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు ముగిశాయి. దాదాపు 20 రాష్ర్టాల నుంచి వచ్చిన ప్లేయర్లతో పోటీలు హోరాహోరీగా సాగాయి. సోమవారం జరిగిన ఫైనల్లో తమిళనాడు బాలుర జట్టు కేరళపై అద్భుత విజయంతో ట్రోఫీ దక్కించుకుంది. బాలికల విభాగంలో తమిళనాడు..ఆంధ్రప్రదేశ్‌పై గెలిచి విజేతగా నిలిచింది. బాలుర కేటగిరీలో మహారాష్ట్ర, తెలంగాణ వరుసగా మూడు, నాలుగు స్థానాలు దక్కించుకోగా, బాలికల విభాగంలో మహారాష్ట్ర(3), రాజస్థాన్(4) రాణించాయి. పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే దివాకర్‌రావు, జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, జీఎం త్యాగరాజు, రామకృష్ణరావు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.