మారేడ్‌పల్లి: బల్గేరియా వేదికగా ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగే వరల్డ్ టెన్నిస్ టోర్నీకి నగరానికి చెందిన పొన్నాల సిద్ధార్థ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా శనివారం వెస్ట్‌మారేడ్‌పల్లిలోని నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను సిద్ధార్థ మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు.
ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఎంపికైన యువ ప్లేయర్‌ను మంత్రి శాలువాతో సత్కరించి అభినందించారు. రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక టెన్నిస్ ప్లేయర్‌గా నిలిచిన సిద్ధార్థ..టైటిల్ విజయంతో తిరిగి రావాలని మంత్రి ఆకాంక్షించారు.