Taijul Islam : సుదీర్ఘ ఫార్మాట్లో బంగ్లాదేశ్ స్టార్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం(Taijul Islam) రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో అత్యధికంగా ఐదేసి వికెట్లు తీసిన ఐదో స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో తైజుల్ ఈ ఘనతకు చేరువయ్యాడు. రెడ్ బాల్ క్రికెట్లో 5 వికెట్ల ప్రదర్శన చేయండి అతడికిది 16వ సారి. దాంతో, భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) రికార్డును తైజుల్ బద్ధలు కొట్టాడు.
బంగ్లా తరఫున టెస్టుల్లో అత్యధికసార్లు ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు తైజుల్. షకీబుల్ హసన్ టాప్‌లో ఉండగా.. మెహిదీ హసన్ మిరాజ్(12సార్లు) మూడో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయంగా చూస్తే శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగన హెరాత్(Rangana Herath) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. మిస్టరీ స్పిన్నర్ అయిన హెరాత్ 34 పర్యాయాలు 5 వికెట్లు పడగొట్టాడు.
🇧🇩 Bangladesh’s Taijul Islam now has the most 5-wicket hauls in Test cricket as an active left-arm spinner, overtaking Ravindra Jadeja 💫🏏 pic.twitter.com/Z6GE06K6sy
— Cricwick (@Cricwick) April 28, 2025
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డానియల్ వెటోరీ 20 సార్లు ఐదేసి వికెట్లు తీసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ ఈ జాబితాలో మూడో ప్లేస్‌లో ఉన్నాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ 19సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. ఇంగ్లండ్ స్పిన్నర్ డెరెక్ అండర్వుడ్ 17 సందర్బాల్లో 5 వికెట్లు నేలకూల్చాడు.